మిర్యాలగూడలో “టీబీ ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమం
NLG: మిర్యాలగూడలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో "టీబీ ముక్త్ భారత్ అభియాన్"పై సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు అక్టోబర్ 2 నాటికి నల్గొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. బాగా పనిచేసిన ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను సన్మానిస్తామన్నారు.