తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన
BHPL: జిల్లాలో సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టు ముందు భూనిర్వాసితులు తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్, కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జంగేడు, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ, హనుమాన్ నగర్ వాసులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వారు నిరసన వ్యక్తం చేశారు.