పాల సొసైటీలో బోనస్ పంపిణీ
కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి కృష్ణా మిల్క్ యూనియన్ పాల సేకరణ కేంద్రంలో సుమారు 100 మంది రైతులకు సోమవారం రాత్రి రూ. 1.84 లక్షలు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షులు కసుకుర్తి నిరంజన్ రావు చేతుల మీదుగా ఈ నగదును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కోడేబోయిన బాబి, లంక వెంకటేశ్వరరావు, సంఘ సెక్రెటరీ చలుమూరి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.