'పోలీసు శాఖలో హోంగార్డు వ్యవస్థ భాగమే'

'పోలీసు శాఖలో హోంగార్డు వ్యవస్థ భాగమే'

SRD: పోలీసు శాఖలో హోంగార్డు వ్యవస్థ భాగమేనని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరిధి మైదానంలో హోంగార్డు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రైసింగ్ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు.