శ్రీరామ నినాదాలతో మారు మ్రోగిన ఆలయం

శ్రీరామ నినాదాలతో మారు మ్రోగిన ఆలయం

RR: షాద్‌నగర్ పట్టణ పరిధిలోని సోలిపూర్ చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రజలు, భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు, భజన బృందంతో కలిసి స్వామివారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ నినాదాలతో, భజనలతో ఆలయం మారు మ్రోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.