నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడు అల్లపల్లి మండలంలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ నాయకులు పాయం రామనర్సయ్య, వాసం శ్రీకాంత్, మహ్మద్ అతహార్ గురువారం సాయంత్రం వెల్లడించారు. ఎమ్మెల్యే శుక్రవారం అల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.