శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ SIగా ప్రియాంక
తిరుపతి: శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ నూతన SIగా ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి స్పెషల్ బ్రాంచ్ పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రియాంక బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈమెతోపాటు రెండు రోజుల క్రితమే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న తరుణ్, బుచ్చి నాయుడుకండ్రిగ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సుధీర్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడే బాధ్యతలు స్వీకరించారు.