'మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి'

JN: పాలకుర్తిలో బీజేపీ నేతలు సేవా పక్షం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు.