చెరువు సుందరీకరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

HYD: నియోజకవర్గంలోని అన్ని చెరువులను సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలో గురునాథం చెరువు సుందరీకరణ పనులను హైడ్రా అధికారులతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 64 చెరువులున్నాయని, దశలవారీగా అన్ని చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు.