బీ-ఫారం కోసం ఆశావహుల ఆందోళన

బీ-ఫారం కోసం ఆశావహుల ఆందోళన

వరంగల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీ-ఫారం లభిస్తుందో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్క్రూట్ని జరగ్గా, వర్ధన్నపేటలో 121, నర్సంపేటలో 291 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ఆశావహులు బీ-ఫారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయగా, కొన్ని వార్డుల్లో రెబల్స్ బెడద తలెత్తే అవకాశముంది.