VIDEO: 'మహిళలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం'
HNK: మహిళలను అన్ని రంగాల్లో ముందుంచడమే CM రేవంత్ రెడ్డి లక్ష్యమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఇవాళ బాలసముద్రంలోని MLA కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పార్టీలకతీతంగా ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.