VIDEO: కొండగట్టుకు పోటేత్తిన భక్తులు
JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంకు భక్తులు పోటేత్తారు. వై జంక్షన్ నుంచి స్వామివారి ఆలయం వరకు స్వాములతో నిండుకొని ఉంది. చిన్న జయంతిని పురస్కరించుకుని వస్తున్న దీక్షా స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణంతో నిండిపోయింది. దాదాపు లక్షకు పైచిలుకు స్వాములు, భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. స్వామి సన్నిధానం రామనామ స్మరణతో మార్మోగుతోంది.