ఇరాన్‌తో యుద్ధానికి సెనెట్ మద్దతు

ఇరాన్‌తో యుద్ధానికి సెనెట్ మద్దతు

ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. ఈ విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేయడానికి తీసుకొచ్చిన 'వార్ పవర్స్' తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 53, అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. దీంతో ఇరాన్‌పై యుద్ధం కొనసాగించడానికి సెనెట్‌లో ట్రంప్‌నకు మద్దతు లభించినట్లైంది.