కారు, బొలెరో ఢీ.. తప్పిన ప్రాణాపాయం
KMM: వైరా మున్సిపాలిటీ శాంతినగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి 2 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.