పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన

పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన

GDL: రాజోలిలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అంతకుముందు ఐకేపీ ఏపీఎం మార్తమ్మ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సీసీ మద్దిలేటి, వీవోఏలు సుధీర్, రాజేష్, హనుమంతు పాల్గొన్నారు.