వాట్సాప్ గ్రూప్‌ల నుంచి వైదొలిగిన సచివాలయ ఉద్యోగులు
GNTR: తెనాలిలో సచివాలయ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు. అనంతరం ఎంపీడీవో అత్తోట దీప్తిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. డోర్ టు డోర్ సర్వే తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని, ఇంక్రిమెంట్లు, ఏరియర్స్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.