'పోలీస్ వాహనాల పార్కింగ్ నిర్మాణ పనులు పరిశీలన'
WNP: జిల్లా సాయుధ దళ పోలీస్ కార్యాలయ పక్కన పోలీస్ వాహనాల నిల్వ, సంరక్షణ కోసం నిర్మిస్తున్న పార్కింగ్ షెడ్ పనులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమయానికి, సమర్థంగా ప్రజలకు సేవ చేయాలంటే వారికి మౌలిక వసతులు ఉండాలని అన్నారు. పోలీస్ శాఖ అభివృద్ధి అంటే ప్రజాసేవకు బలమైన పునాదని పేర్కొన్నారు.