‘చదువుల పండుగ 2.0’ విజయవంతం: డీఈఓ
NRPT: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘చదువుల పండుగ 2.0’ కార్యక్రమం విజయవంతంగా పూర్తైందని డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, ఎంఈఓలు కీలక పాత్ర పోషించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో జిల్లాను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.