చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

ELR: తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సోమవారం ముదినేపల్లి పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి రూ.45 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కలిదిండి మండలంకు చెందిన గొల్ల వంశీ, కాల దేవి ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.