పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్

JGL: కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏఖీనపూర్ శివారులో శనివారం పేకాట శిబిరంపై జగిత్యాల సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 4,560 స్వాధీనం చేసుకుని కోరుట్ల పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.