టీడీపీ మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

పశ్చిమగోదావరి: ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటు కూరి వెంకట శివరామరాజు పై ఎన్నికల కోడ్ ఉల్లంగించినందున ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్సై నాళం శ్రీనివాసరావు శుక్రవారం తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన పాలకోడేరు మండలంలో సుమారు 30 వాహనాలతో అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించారని ఎస్సై తెలిపారు.