జిల్లాలో తగ్గిన చలి తీవ్రత..!
NGKL: జిల్లాలో ఈరోజు చలితీవ్రత తగ్గింది. గడిచిన 24 గంటలో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండ మండలం సిర్సనగండ్ల 20.1, పదర మండలం వంకేశ్వర్ 20.7, వెల్దండ మండలం బొల్లంపల్లి 20.9, నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరులో 21.1, తెలకపల్లిలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.