'ఆదాయం ఫుల్.. సౌకర్యాలు నిల్'

'ఆదాయం ఫుల్.. సౌకర్యాలు నిల్'

ప్రకాశం: చీరాల ఆర్టీసీ బస్‌ స్టాండ్‌కు ఆదాయం ఫుల్‌గా ఉన్నా బస్టాండ్‌లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వేసవిని తలపించేలా ఎండలు మండుతుంటే కనీస వసతులు కరువయ్యానని ఆరోపిస్తున్నారు. వందలాది మంది వివిధ గ్రామాలకు ప్రయాణించే బస్టాండ్‌లో ఫ్యాన్లు తిరగడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.