VIDEO: ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే బురదలో దిగాల్సిందే
VZM: నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే బురదలో దిగాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంగణంలోని రెవెన్యూ, ఇరిగేషన్, హౌసింగ్, మండల పరిషత్ కార్యాలయాల ముందు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఇక్కడికి వచ్చే సందర్శకులు బురదలో దిగాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి, సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.