VIDEO: ఆనందంతో టెన్త్ క్లాస్ విద్యార్థులు

VIDEO: ఆనందంతో టెన్త్ క్లాస్ విద్యార్థులు

ప్రకాశం: ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు సింగరాయకొండలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. కొందరు విద్యార్థులు రోడ్లపై అరుస్తూ, పేపర్లు చించుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.