లక్కవరం హైస్కూల్‌లో FLN విద్యా సర్వే
AKP: లక్కవరం హైస్కూల్‌లో ప్రైమరీ విద్యార్థుల విద్యా ప్రమాణాలపై మంగళవారం FLN ప్రోగ్రామ్‌లో భాగంగా సమగ్ర సర్వే నిర్వహించారు. CRMT సరోజిని తెలుగు, ఆంగ్లం, గణితం అంశాల్లో విద్యార్థుల ప్రగతిని ఆన్‌లైన్ ద్వారా మదింపు చేసి ప్రత్యేక యాప్‌లోపై అధికారులకు నివేదించారు. వెనుకబడిన విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక బోధన అందించనున్నట్లు తెలిపారు.