చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్
MNCL: హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంపల్లి గ్రామంలో ఈనెల 20న ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న రాదండి పోసు అనే వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల ఎసీపీ ప్రకాష్ మంగళవారం తెలిపారు. నిందితులు విజేతల శ్రీనివాస్, దాసారపు సతీష్‌లను రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు.