గృహజ్యోతి బిల్లు జీరో రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

సూర్యాపేట: తుంగతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల్లో భాగంగా శనివారం గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు బిల్లు జీరో రావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.