ఈ నెల 30న పౌరహక్కుల దినోత్సవం

KNR: శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లిలో ఈ నెల 30న పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు మంగళవారం తహశీల్దార్ కె.సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కుల వివక్ష, అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్థులు హాజరుకావాలని ఆమె కోరారు.