మైలవరం చేరుకున్న పదో తరగతి ప్రశ్నాపత్రాలు

మైలవరం చేరుకున్న పదో తరగతి ప్రశ్నాపత్రాలు

KDP: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మైలవరం మండలానికి చేరుకున్నాయి. మైలవరం MEO చిట్టిబాబు ఆధ్వర్యంలో కడప నుంచి ప్రత్యేక వాహనంలో భద్రత మధ్య SET 1, SET 2 ప్రశ్నాపత్రాల పెట్టెలను తీసుకువచ్చి మైలవరం పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.