కేబుల్ వైర్ల దొంగలు అరెస్ట్
KDP: ఎర్రగుంట్ల కలమల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లూరులో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పొలాల్లోని త్రీఫేస్ కేబుల్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి వైరును దొంగిలిస్తున్న వీరిని అరెస్టు చేశామన్నారు.