VIDEO: చెరువుగట్టులో అగ్నిగుండాల కార్యక్రమం

NLG: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, శివసత్తులు భారీగా తరలివచ్చి అగ్నిగుండాలు తొక్కారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగిపోయాయి.