చిత్తూరులోని దుకాణాలలో తనిఖీలు

చిత్తూరులోని దుకాణాలలో తనిఖీలు

CTR: చిత్తూరులో పలు దుకాణాలపై నగర పాలక ఎంహెచ్‌వో డా. లోకేశ్, 1 టౌన్ సీఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారంపై ఈ తనిఖీలు జరిగాయి. చర్చివీధి, వేపమానువీధి, సామిరెడ్డి వీధుల్లోని దుకాణాల్లో మొత్తం 83 బస్తాల నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.