ఏడేళ్లలో ఇదే మొదటిసారి..!
HYD: మహానగరాన్ని చలిపులి వణికిస్తోంది. ఏడేళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 6.3 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక మౌలాలిలో 7.3, రాజేంద్రనగర్‌లో 7.7, శివరాంపల్లిలో 8.8, గచ్చిబౌలిలో 9.1, బొల్లారంలో 9.3, మారేడ్‌పల్లిలో 10.1, కుత్బుల్లాపూర్‌లో 10.2, జీడిమెట్లలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.