VIDEO: భక్తులతో కిక్కిరిసిన దొన గంగమ్మ ఆలయం

ATP: రాయదుర్గం మండల పరిధిలోని టి. వీరాపురం గ్రామంలో వెలసిన దొన గంగమ్మ జాతర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వారంతా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.