VIDEO: పామర్రులో 'రైతన్న మీకోసం' కార్యక్రమం
కృష్ణా: పామర్రు మండలం జమ్మిగొల్వేపల్లి, పెదమద్దాలి గ్రామాల్లో 'రైతన్న మీకోసం' కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాతలకు ఆర్థికంగా బలాన్నిచ్చే పథకాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.