వడదెబ్బతో టీడీపీ నాయకుడికి అస్వస్థత
సత్యసాయి:పెనుకొండ పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు బాబిరెడ్డి ఆదివారం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు ఆసుపత్రికి చేరుకుని బాబిరెడ్డిని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు.