వైరాలో వార్డుల వారీగా ఇంఛార్జ్‌ల నియామకం
KMM: మున్సిపల్ ఎన్నికల్లో వైరాపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. బుధవారం రేచర్ల బజార్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల పక్కా ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డుకు ప్రత్యేక ఇంఛార్జ్‌లను నియమించారు.