పాక్‌కు మరోసారి షాకిచ్చిన భారత్

భారత్ మరోసారి పాక్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన అనంతరం, కశ్మీర్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. పాక్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సలాల్, బాగ్లీహార్ డ్యామ్‌లలో రిజర్వాయర్ ఫ్లషింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కాగా, ప్రస్తుతం భారత్ విద్యుదుత్పత్తిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.