మార్కెట్‌కు 1,788 క్వింటాళ్ల పెసర్లు

మార్కెట్‌కు  1,788 క్వింటాళ్ల పెసర్లు

SRPT: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు  3 రోజుల నుంచి పెసర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి పెసర్ల రాక ప్రారంభం కాగా 1,788 క్వింటాళ్లు వచ్చాయి. ప్రారంభంలో క్వింటాకు ₹8,029 ధర రాగా, గురువారం రికార్డు స్థాయిలో క్వింటా ₹8,500 పలికింది. సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో ఇక ముందు మరింతగా పెసర్లు మార్కెట్‌కు పోటెత్తే అవకాశం ఉందని మార్కెట్ సెక్రటరీ తెలిపారు.