ORR ఎగ్జిట్ నెంబర్ 18A మూసివేత

ORR ఎగ్జిట్ నెంబర్ 18A మూసివేత

RR: హిమాయత్ సాగర్ వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 మూసివేసిన పోలీసు అధికారులు, వాటర్ లాగింగ్ కారణంగా 18A కొద్దిసేపటి క్రితం మూసివేసినట్లు ప్రకటించారు. నంది విగ్రహం నుంచి గ్రేహౌండ్స్ వరకు ఇది కొనసాగుతుందన్నారు. గండిపేట రిజర్వాయర్ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.