ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఉషశ్రీ చరణ్

సత్యసాయి: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ రొద్దం మండలంలో పర్యటించారు. కందుకూర్లపల్లి గ్రామంలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.