ప్రమాదకరంగా మారిన బ్రిడ్జ్.. ప్రజల ఇక్కట్లు
SRPT: నడిగూడెం మండలం చాకిరాల బ్రిడ్జి కుంగిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాల్లో వెళ్లే ప్రజలు బ్రిడ్జి దాటాలంటే వాహనం దిగి నడిచి పోవాల్సిన దుస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.