'గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది'
PLD: వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ మురళీకృష్ణ మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు లాభాల కోసం సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యానవన పంటల వైపు మళ్లాలన్నారు. త్వరలో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.