'ఖబరస్తాన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా'

HYD: సనత్ నగర్లో ఖబరస్తాన్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఖబరస్తాన్ ఏర్పాటుకు ప్రయత్నించానని, అయితే అందుకు అవసరమైన స్థలం అందుబాటులో లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్ నోమాన్, మాజిద్, యాకుబ్ పాల్గొన్నారు.