ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లు
VSP: విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ఏపీ ఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ సీఎండి పృథ్వీతేజ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు సర్వీస్‌కు సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లుల వివరాలు, చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా కొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.