వరద నష్టంపై వివరాలు సమర్పించండి: సీఎం

NZB: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టాలపై సమగ్ర వివరాలతో తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు, వరద సహాయంపైన ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.