VIDEO: విషాదం.. అర్ధగంట తేడాతో అన్నదమ్ముల మృతి

VIDEO: విషాదం.. అర్ధగంట తేడాతో అన్నదమ్ముల మృతి

HNK: ఐనవోలు మండలం కొండపర్తిలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. గద్దల కొమురయ్య మంగళవారం ఉదయం మృతి చెందగా, అన్న మృతి వార్త తెలుసుకున్న తమ్ముడు ఐలయ్య తీవ్ర విషాదానికి లోనయ్యాడు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అర్ధగంట వ్యవధిలోనే తమ్ముడు గద్దల ఐలయ్య కూడా కన్నుమూశాడు. ఒకే కుటుంబంలో వరుసగా ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.