పరేడ్ నిర్వహించిన పోలీసులు

WGL: పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ పోలీస్ సిబ్బంది శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ తిలకించిన స్థానికులు పోలీసుల క్రమశిక్షణకు అబ్బురపడ్డారు. ఈ పరేడ్లో ఇన్స్పెక్టర్, SIలు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. సిబ్బంది క్రమశిక్షణలో భాగంగా పరేడ్ నిర్వహించామని అధికారులు తెలిపారు.