కంపోస్టు యార్డును పరిశీలించిన అధికారులు
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కంపోస్టు యార్డును ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి సోమవారం పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్తను తగ్గించడంపై చర్యలు చేపట్టారు. పాత వ్యర్థాలను కంపోస్టు యార్డుకు తెచ్చి అనంతరం తాడిపత్రిలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకు ఈ వ్యర్థాలను తరలించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.